త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి విరాళం అందజేసిన ఎమ్మెల్యే తల్లిదండ్రులు,సోదరి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు త్రిలింగ రామేశ్వర దేవాలయం అభివృద్ధి నిమిత్తం దేవాలయ ట్రస్ట్కు ఒక లక్ష రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సోదరి శోభ తల్లిదండ్రులు వజ్రమ్మ రాజేశ్వరరావు దంపతుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తల్లిదండ్రులు వజ్రమ్మ రాజేశ్వరరావు దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కోరిన కోరికలు తీర్చే మహిమనివత దేవాలయం సందర్శించడం చాలా సంతోషంగా ఉందని,ఆలయ అభివృద్ధిలో తమ వంతు పాత్ర కూడా పోషిస్తామని ఆలయ విశ్వవ్యాప్తంగా చేసేందుకు తమ వంతు సహకరిస్తామని ఆలయ కమిటీ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాద గౌడ్, ఉప సర్పంచ్ అభిషేక్, ఆలయ కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు,కోశాధికారి రమేష్,కమిటీ సభ్యులు వేముల సంగయ్య,వార్డ్ మెంబర్లు తలకొక్కుల సత్యనారాయణ,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.




