8 August, 2026 | 3:59 AM

రాబడి పెంపునకు మార్గాలేంటి?

08-08-2026 12:00 AM

ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో సీఎం రేవంత్ భేటీ

జీఎస్టీ, ఎక్సైజ్ శాఖలో సంస్కరణలపై చర్చ 

ఆదాయ మార్గాలపై ఆరా 

లోపాలను నివారిస్తే సాధ్యమే 

సీఎంకు ఆర్థికవేత్త సూచనలు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచే మార్గాలేంటి? జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో  రాబడి మ రింత పెంచుకోవడం ఎలా? అనే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో చర్చించారు.

శుక్రవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికవేత్త  భే టీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన సంస్కరణలు, సాంకేతికత వినియోగంపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.

రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచేలా టెక్నాలజీ వినియోగించాలని ఆర్థికవేత్త వివరించారు.  భవన నిర్మాణ రంగంలో పన్నుల లీకేజీలను అరికట్టేలా మున్సిపల్, రేరా, పంచాయతీ రాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ ఆధారిత సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలు,  పన్నుల అంచనాలు వివరాలను నమోదు చేయాలన్నారు. ఆర్థికవేత్త సూచలనపై స్పందించిన సీఎం రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంతో పాటు వ్యాపారులకు ఇబ్బందులకు లేకుండా సులభతర వాణిజ్య విధానా లు పాటించాలని అధికారులకు సూచించారు.

ఏఐ ఆధారిత వ్యవస్థను అందుబాబులోకి తీ సుకువచ్చి ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియతో వ్యా పారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందు లు కలగకుండా ఉండాలని స్పష్టం చేశారు. అదే విధంగా ఈ డేటాతో పాటు మీసేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని చెప్పా రు.  సమావేశంలో ముఖ్యమంత్రి  సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్ సెక్రటరీ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు.