6 May, 2026 | 8:43 PM

Breaking News

లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •  

రాజ్‌నాథ్‌ సింగ్‌తో సీఎం రేవంత్‌ భేటీ

10-09-2025 11:12 AM

న్యూఢిల్లీ: హస్తిన పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బుధవారం నాడు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) తో భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే సమావేశం ముగిసింది. రాజ్ నాథ్ సింగ్, రేవంత్ రెడ్డి సమావేశం సుమారు అరగంట పాటు జరిగింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపట్టనున్నట్లు రాజ్ నాథ్ కు సీఎం తెలిపారు. గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తోందని తెలిపారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి వెంట‌నే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ముఖ్యమంత్రి నిన్న కేంద్ర రవాణా, జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కూడా తెలంగాణ‌ - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానుల మ‌ధ్య గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మించాల్సి ఉంద‌ని గుర్తుచేశారు.