6 May, 2026 | 7:57 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

అణచివేతపై ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ: సీఎం రేవంత్

10-09-2025 11:27 AM

హైదరాబాద్:  భూస్వాముల దురాగతాలపై తిరగబడ్డ బహుజన ధీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి(Chakali Ilamma death anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆ వీరనారికి ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి రేవంత్ రెడ్డి ఐలమ్మ నివాళలర్పించారు. అణచివేతపై ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ అని రేవంత్ రెడ్డి కొనియాడారు. సమ్మక్క-సారక్క, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) నివాళలర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం బహుజనుల విముక్తి కోసం పోరాడిన తెలంగాణ ధీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ.. ఆమె వర్ధంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి నివాళులు.'' అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.