30 June, 2026 | 8:37 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

పేదలకు అండగా సిఎం సహాయ నిధి

14-04-2026 08:23 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు సిఎం సహాయ నిధి వరమని మఠంపల్లి సర్పంచ్ ఏసుమల్ల వీర లక్ష్మిపాపయ్య అన్నారు. మంగళవారం మఠంపల్లి గ్రామంలోని పలువురు బాధితులకు మంజూరైన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉప సర్పంచ్ కొత్తపల్లి శౌరితో కలిసి పంపిణీ చేశారు. గ్రామంలో మొత్తం ముగ్గురికి రూ.2.10 లక్షల విలువైన చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. హుజూర్ నగర్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి,శుభోదయం యువజన సంఘం అధ్యక్షులు,వార్డ్ సభ్యులు గాదె జయ భారత్ రెడ్డి, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.