2 July, 2026 | 12:01 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

01-01-2026 12:00 AM

చిన్నంబావి, డిసెంబర్ 31: మండల పరిధిలోని  కొప్పునూర్ గ్రామానికి చెందిన బూర్గుల మహేష్ అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతుండగా ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంజూరైన  రూ.లక్ష 50 వేల ఎల్వోసీ చెక్కును బుధవారం బాధిత కుటుంబానికి గ్రామ సర్పంచ్ వడ్డేమాన్ బిచ్చన్న అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న అనారోగ్య బాధితులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సీఎం సహాయనిధి రూపంలో సహాయం చేయడం జరుగుతుందన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచు సుదర్శన్ రెడ్డి, జంగా బీచుపల్లి యాదవ్, తలారి నిర్మల, తగరం శ్రీను, సాంబ, సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.