28 April, 2026 | 2:41 PM

గూగుల్‌ రాక ఏపీకి గేమ్‌ ఛేంజర్‌

28-04-2026 12:51 PM

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌కు(Google Vizag Data Centre) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(CM Chandrababu) కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు ఇది, చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఇది అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం, గూగుల్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

గూగుల్ రాక.. విశాఖకే కాదు.. ఏపీకి ఒక గేమ్ ఛేంజర్(Game Changer) అన్నారు. 1997లో హైటెక్స్ సిటీలో ప్రారంభించాం, సైబరాబాద్ నగరాన్ని(Cyberabad City) నిర్మాణం చేసుకున్నామని పేర్కొన్నారు. నాడు హైటెక్ సిటీ.. ఐటీ విప్లవానికి నాంది పలికిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ .. ఏపీ టెక్నాలజీతో పాటు దేశానికే గ్రోత్ ఇంజిన్ కానుందని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు ఏపీ ఎప్పుడూ స్వాగతం పలుకుతోందన్నారు.ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తోందన్నారు. దేశానికి ఏపీ.. అంతర్జాతీయ డేటా గేట్ వేగా(International data gateway) నిలుస్తుందని చెప్పారు. కేవలం శంకుస్థాపనే కాదు.. ఏపీ డిజిటల్ భవిష్యత్ కు పునాదులు వేస్తున్నామని తెలిపారు. 

సెర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్.. ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్ గా మారిందని కొనియాడారు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ ఏఐ డేటా సెంటర్(Google AI Data Center) పూర్తి కావాలన్నారు. రెండు, మూడు నెలలు ముందుగానే పూర్తి చేసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతోందని చంద్రబాబు సూచించారు.  ఓడరేవుల వంటి కీలక రంగాల్లో పనిచేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ అదానీ అన్నారు. ప్రజలను కమ్యూనికేషన్ తో అనుసంధానం చేస్తున్న మరో సంస్థ ఎయిర్ టెల్ అన్నారు. ప్రముఖ సంస్థలు విశాఖలో పెట్టుబడులకు రావడం శుభపరిణామన్నారు. ఈ మూడు సంస్థలు ఎప్పుడూ నూతన ఆలోచనలు చేస్తుంటాయని చంద్రబాబు కొనియాడారు. గూగుల్ ఆవిష్కరణలు..ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండూ కలుస్తున్నాయని స్పష్టం చేశారు.