వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళ
27-07-2026 08:58 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండలంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి పూజ ఆధ్వర్యంలో విత్తన మేళను ప్రారంభించారు. ఎల్ నినో ప్రభావంతో తక్కువ నీరుతో పండే పంటలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు వచ్చే కందులు, సజ్జలు, రాగులు, కొర్ర, సామలు, కూరగాయలను సాగు చేసుకోవాలన్నారు. మండలానికి చెందిన కిసాన్ ట్రేడర్స్, రైతు మిత్ర, మన గ్రోమోర్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్లు రైతువేదికలో స్టాళ్లు ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న విత్తనాలు,నానో యూరియా, నానో డిఎపి ఉపయోగాలను రైతులకు వివరించారు. మూడు రోజుల పాటు జరిగే విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలను పొందాలని తెలిపారు.






