27 July, 2026 | 9:54 PM

పెండింగ్ లేకుండా ప్రజావాణి అర్జీల పరిష్కారం

27-07-2026 08:59 PM

- కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో 134 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ - 64, గ్రామీణాభివృద్ధి - 17, సర్వే ల్యాండ్స్, మున్సిపాలిటీ - 8 చొప్పున అర్జీలు వచ్చాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులు తక్కువ నీటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. ఈ నెల 28 నుంచి అన్ని రైతు వేదికల్లో ఎల్ నినో, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.