జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ కె. హరిత
27-07-2026 08:53 PM
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని న్యాయస్థాన భవన సముదాయంలో జిల్లా ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి శారదాదేవిను జిల్లా కలెక్టర్ కె. హరిత సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జడ్జికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.






