27 July, 2026 | 9:48 PM

సహకార సంఘాల ఎన్నికల సందడి

27-07-2026 08:51 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్  కరీంనగర్ కు ఆగస్టు 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి మహమ్మద్ జలాలొద్దీన్ అక్బర్,అసిస్టెంట్ రిజిస్ట్రార్  తెలిపారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22 బుధవారం నాడు ఎన్నికల నోటీసు జారీ చేస్తూ, యూనియన్ కార్యాలయం పద్మనగర్ కరీంనగర్ లో ఈ నెల 27,28 మరియు 29 తేదిలలో నామినేషన్ల స్వీకరణ జరగనుందని, 30న పరిశీలన, 31న ఉపసంహరణ ఉంటుంది.

గతంలో ఉమ్మడి జిల్లా యూనియన్  కొనసాగగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త 33 జిల్లాలకు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించారని ఇందులో   భాగంగా మొట్ట మొదటి సారిగా కరీంనగర్ జిల్లాలోని 16 మండలాలలోని 139 ప్రాథమిక గొర్రెల పెంపకం సహకార సంఘాలు అధ్యక్ష ఎన్నికలో పాల్గొనుటకు అర్హులు. ఆగస్టు 5న రహస్య బ్యాలెట్ ద్వారా షెడ్యూల్ ప్రకారం పోలింగ్ జరగనుందని తెలిపారు. 15 సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లలో  ఎన్నికలు రావడం వలన గొర్రెల పెంపకం సహకార సంఘాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.