27 July, 2026 | 10:06 PM

దాతర్ పల్లి గ్రామ పంచాయతీలో జలసిరిపై అవగాహన

27-07-2026 09:08 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్ పల్లి గ్రామపంచాయతీలో తెలంగాణ జలసిరి పై అవగాహన కార్యక్రమాన్ని మండల అధికారి సమక్షంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యంగా ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే సూచనలు తక్కువగా ఉన్నందున దీనికి తగ్గట్టుగా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుదాం, భవిష్యత్తును కాపాడుదాం అనే శీర్షికన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ముఖ్యంగా ఇంటి నుంచి వచ్చే మురికి నీరు నిలువ చేసేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, భూగర్భ జలాలు అడుగంటి పోకుండా సాగు భూమి ప్రాంతంలో పంట కుంటలను నిర్మించుకోవాలని, దీని ద్వారా భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు, బోరు బావులు బావుల వద్ద వృధాగా పోవుచున్న నీటిని ఒడిసి పట్టేందుకు బోరు కుంటలను నిర్మించు కోవాలని, తద్వారా బోరుబావులు రీచార్జి అవుతాయని వారు గ్రామస్తులతో తెలిపారు. ఇందులో మండల టి ఏ సత్యం, భగీరథ అధికారి, గ్రామ పాలక సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.