సిలిండర్స్ అక్రమంగా వినియోగిస్తున్నవారిపై సివిల్ సప్లయ్ ఇన్ఫోర్స్మెంట్ టీం దాడులు
23-03-2026 04:37 PM
దేవరకొండ,(విజయ క్రాంతి): సిలిండర్స్ అక్రమముగా వినియోగిస్తున్నవారిపై సివిల్ సప్లయ్ ఇన్ఫోర్స్మెంట్ టీం దాడులు నిర్వహించారు. సోమవారం దేవరపట్టణంలో చికెన్ సెంటర్లు, హోటల్స్, బేకరీలలో డోమెస్టిక్ సిలిండర్స్ అక్రమముగా వినియోగిస్తున్నవారిపై సివిల్ సప్లయ్ ఇన్ఫోర్స్మెంట్ టీం దాడులు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న 27 సిలిండర్లలో 3 నిండు సిలిండర్లు 24 ఖాళీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. భద్రత నిమిత్తము హెచ్ పి గోదాములో అప్పగించారు.




