పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
23-03-2026 04:33 PM
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పట్టణ పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించాలని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా (99 రోజుల యాక్షన్ ప్లాన్) 4వ వార్డులో పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ బిరుదు రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు.




