12 July, 2026 | 5:48 PM

Breaking News

ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •  

స్టేట్ లెవెల్ సీఎం కప్ పోటీలకు ఎంపికైన సిటీ స్టైల్ జిమ్ భద్రాచలం క్రీడాకారిణిలు

12-02-2026 12:00 AM

భద్రాచలం, ఫిబ్రవరి 11, (విజయక్రాంతి): సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో భాగంగా భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ సెంటర్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ సెంటర్కు చెందిన మామిడి భూమిక 69 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని, డి మేఘనా చౌదరి, 69 కేజీలు విభాగంలో  రజిత పతకం సాధించినట్లు సిటీ స్టైల్ జిమ్ కోచ్ జి వి రామిరెడ్డి  తెలిపారు.

ఈ పోటీలో గెలుపొందిన  క్రీడాకారిణిలు  ఈనెల 20,  21 వ తేదీలలో, హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో జరిగే  సీఎం కప్  స్టేట్ లెవెల్ పోటీలలో పాల్గొంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ గెలుపొందిన క్రీడాకారిణిలను  తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి మల్లేష్, 

జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ, జీవి రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, కోశాధికారి మహంతి వెంకటకృష్ణజి,  జాయింట్ సెక్రటరీలు, భవాని శంకర్, గుగులోత్ శోభన్ నాయక్, అబ్దుల్ ఫరూక్, ఎండి  అబ్బాస్, పట్టణంలోని పలు క్రీడా సంఘాలు, పట్టణ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారులు, డివి శంకర్రావు, భోగాల వీరారెడ్డి  అభినందించారు.