12-02-2026 12:00:00 AM
ఖమ్మం ఈపీఎఫ్ కార్యాలయం ముందు మూడో రోజు ధర్నా ,ర్యాలీ
ఖమ్మం టౌన్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): ఈపిఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9000 అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఆల్ ఇండియా యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఈ పి ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్స్ పిలుపుమేరకు బుధవారం జిల్లా అధ్యక్షులు ఎల్ గోపిచంద్ అధ్యక్షతన ఈ పి ఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ టిఏపిఆర్‌పిఏ రాష్ట్ర బాధ్యులు శ్రీరాములు మాట్లాడుతూ నిత్యావసర ధరలు పెరుగుదలతో ఈపీఎస్- పెన్షనర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస పెన్షన్ 9000 పెంచడంతోపాటు పెండింగ్ డి ఏ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014లో జారీచేసిన నోటిఫికేషన్ -609 ను తక్షణమే రద్దు చేయాలని గరిష్ట పెన్షన్ పరిమితిని పెంచాలని కోరారు. పెన్షనర్స్ కు ఉచిత వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పించాలని పెన్షన్ నిధుల ప్రైవేటీకరణ ను నిలిపివేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
పాలేరు డివిజన్ అధ్యక్షులు ఏటుకూరు రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా కమిటీలు వేస్తూ పత్రిక ప్రకటనలకు పరిమితమై పెన్షనర్స్ ను నిర్లక్ష్యం చేస్తుందని ఎన్ని పోరాటాలు విజ్ఞప్తులు ధర్నాలు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ ను 9000 పెంచాలని లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం నాగేశ్వరావు జిల్లా కోశాధికారి టి ఎన్ రావు, ఉపాధ్యక్షులు నెల్లూరు వీరబాబు, జిల్లా కార్యదర్శులు సిహెచ్ భాస్కర్ రెడ్డి,ఝాన్సీ, భాస్కరరావు, కె.వి.రామారావు, వై రవికుమార్, కిలారు కుటుంబరావు, వై మధుసూదన్ రావు, గణపతి, స్వామి, అంజయ్య, పగడాల నాగేశ్వరరావు రాంమెహను రామకృష్ణ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.