19 June, 2026 | 4:30 AM

పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన నగర మేయర్

19-06-2026 02:12 AM

కొత్తపల్లి, జూన్ 18 (విజయక్రాంతి): నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గురువారం 6వ డివిజన్ బొమ్మకల్ ప్రాంతంలో నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు శానిటేషన్ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం 17, 18వ డివిజన్లలో చేపడుతున్న మంచినీటి బావి తవ్వకం పనులను మేయర్ ప్రారంభించారు. నగర ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆధునీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ప్రైమరీ హెల్త్ సెంటర్) భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

ఆరోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలలో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు పనులను పరిశీలించి, పనులు నాణ్యతతో మరియు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల వెంకటేష్, వాసాల రమేష్, వేముల కవిత చంద్రశేఖర్, అడిషనల్ కమిషనర్ సువార్త, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.