23 June, 2026 | 5:20 PM

Breaking News

రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •  

ట్రంపు అవెన్యూ నిర్ణయాన్ని రద్దు చేయాలి

23-06-2026 12:00 AM

నల్ల జెండాలతో సీఐటీయూ నిరసన

మహబూబాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ట్రంపు ఆవెన్యూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీ ఐ టీ యూ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో మహబూబాబాద్ వివేకానంద సెంటర్లో నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు మాట్లాడుతూ హైదరాబాద్ లోని అమెరికన్ కన్సోలేట్ వద్ద ఒక ప్రధాన రహదారికి డోనాల్ ట్రంప్ ఆవెన్యూగా నామకరణం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహం చేశారు. ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి అమెరికా సామ్రాజ్య వాదము ప్రజల మీద యుద్ధాలను చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల రక్త మాంసాలను పీల్చి  పిప్పి చేసిందని  విమర్శించారు.

మన దేశం మీద ట్రంప్ ఆంక్షలు విధించడంతో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మోడీ సహకారం తొడవడంతో దేశం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని వేడల ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ  నాయకులు సమ్మెట రాజమౌళి, దుండి వీరన్న. తాడబోయిన శ్రీశైలం, గుండు సులోచన, పగిడి పాల తిరుపతక్క, కోటేశ్వరరావు, తోట శ్రీనివాస్, పాల బిందెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.