12 March, 2026 | 7:50 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

పార్టీకి విధేయతలుగా ఉన్న వారిని ఎన్నుకోండి

12-03-2026 12:09 AM
  1. వర్గాలేమి లేవు... అందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులమే

ప్రజలకు సేవ చేసేందుకు అందుబాటులో ఉన్న వ్యక్తిని మాత్రమే అవకాశం

రేవల్లి, మార్చి 11 : పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు, నిబద్ధత పని చేసిన నిక్సాన కార్యకర్తకు స ముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి లు అన్నా రు. బుధవారం రేవల్లి మండల కేంద్రంలో మండల పార్టీ కార్యవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాం గ్రెస్ పార్టీ సంస్థాగ త బలోపేతానికి పెద్దపీఠం వేయబోతున్నట్లు తెలిపారు. ఏప్పుడైనా ప్రజలకు నిరంతరమైన సేవ చేసేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎలాంటి వర్గా లు లేకుండా, ఐక్యతగా ఉంటూ పని చేద్దామని, ఏలాంటి అపోహలు లే కుండా అందరం కలిసి మెలిసి పనిచేసే పార్టీని ముందు తీసుకెళ్లాలని , ప్రజలకు సేవలు అందించడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అజెండా అన్నారు. కొత్తగా ఎన్నుకున్న మండల అధ్యక్షుల కార్యవర్గానికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు.

మండల అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించారు.  మండల అధ్యక్షులుగా నియమించిన వారికి త్వరలోనే శిక్షణ తరగతులు ఏర్పా టు చేనున్న మన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ నందిమల్ల యాదయ్య, మాజీ డిసిసి అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఒబిసీ నాయకులు కోట్ల రవి, సీనియర్ నాయకులు తిరుపతయ్య, బ్రహ్మచారి, సాయి చరణ్ రెడ్డి పాండు సాగర్, రణధీర్ రెడ్డి, మండలాధ్యక్షుడు పర్వతాలు, ఆదిత్య,, సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.