17 July, 2026 | 8:12 PM

Breaking News

గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •   కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం   •  

చాక్లెట్ వెరీ డేంజర్

08-06-2025 12:00 AM

చాక్లెట్స్ అంటే చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు వీటిని చాలా ఇష్టంగా తింటారు. వీటిని మితంగా తీసుకుంటే పర్వలేదు కానీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది మాత్రం వీటిని అదే పనిగా తినడానికి ఇష్టపడతారు. 

మనం రోజూ ఐస్ క్రీం, చాక్లెట్, క్యాండీ, బిస్కెట్లు, అనేక ఇతర వస్తువులను తీసుకుంటాం. వాటిలో ఏదో ఒక విధంగా చక్కెర కలుపుతారు. చక్కెర రెండు రకాలు. ఒకటి సహజ చక్కెర, ఇది పండ్లు, పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. ఇది శరీరానికి ఎటువంటి హాని చేయదు. కానీ ఆహార పదార్థాల్లో కలిపిన చక్కెర మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని కారణంగా మీ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది.

క్రమంగా చక్కెరకు బానిసలవుతారు. ఇది సిగరెట్ల కంటే ప్రమాదకరమైనది. కొకైన్ బానిసలు మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులయ్యే విధంగానే ఊబకాయం ఉన్నవారు జంక్ ఫుడ్ పట్ల ఆకర్షితులవుతారని ఒక అధ్యయనంలో తేలింది. నిరంతరం చాక్లెట్ లేదా తీపి పదార్థాలు తీసుకుంటుంటే అది మీకు సిగరెట్ కంటే ప్రమాకరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.