108 అంబులెన్స్‌లో ప్రసవం
16-04-2026 01:50 PM
జైనూర్ ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామానికి చెందిన ఆదివాసీ గర్భిణీ మహిళ కుంరా అనురాధ (22) కు గురువారం పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్ లో జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో జైనూర్ మండలం సమీపంలో జామ్నిగ్రామంలో గర్భిణీ మహిళల నొప్పులు ఎక్కువ కావడంతో 108లో ప్రసూతి చేసినట్లు తెల్పిన 108 ఈ ఏం టి ప్రశాంత్ కుమార్ తెల్పారు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వారికి జైనూర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు వారు తెలిపారు 108 లో ప్రసూతి సురక్షితంగా చేయడంతో ఆ మహిళ బంధువులు 108 ఈ ఎం టి పైలెట్లకు కృతజ్ఞతలు తెలిపారు






