calender_icon.png 19 February, 2026 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

19-02-2026 05:29:25 PM

సుల్తానాబాద్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ లో పూసల రోడ్(చత్రపతి శివాజీ చౌరస్తా) వద్ద సుల్తానాబాద్ ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు ఎనగందుల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో, బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్స్ పంపిణీ చేసి శివాజీ జయంతి వేడుకలు గురువారం  ఘనంగా నిర్వహించారు,  ఈ కార్యక్రమాని కి జిల్లా ప్రధాన కార్యదర్శి  కడారి అశోక్ రావు  మాట్లాడుతూ.. శ్రీ ఛత్రపతి శివాజీమహారాజ్(1630-1680 17వ శతాబ్దంలో పశ్చిమ భారతదేశంలో మొఘల్, బీజాపూర్ నిరంకుశ పాలనను ఎదిరించి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు, హిందూ చక్రవర్తి. ఫిబ్రవరి 19, 1630న శివనేరి కోటలో జన్మించిన ఆయన, గెరిల్లా యుద్ధ తంత్రాలతో అత్యంత బలమైన శత్రువులను ఓడించి, ప్రజల పక్షాన నిలిచిన ధర్మపాలకుడిగా చరిత్రలో నిలిచిపోయారు అని చెప్పారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ పూణేలోని శివనేరి కోటలో షాహాజీ భోంస్లే, జిజాబాయి దంపతులకు జన్మించారు. తల్లి జిజాబాయి చిన్నతనం నుంచే ఆయనలో వీరత్వం, ధర్మం, దైవభక్తిని నూరిపోశారు.మరాఠా సామ్రాజ్య కేవలం 17 ఏళ్ళ వయసులో తోర్నా కోటను స్వాధీనం చేసుకుని తన విజయయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమములో మాజీ మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్, మాజీ సర్పంచ్ లంక శంకర్, కౌన్సిలర్ కందునూరి కుమార్, ఎల్లంకి రాజు, ఎబివిపి జిల్లా కన్వీనర్ రాసురి ప్రవీణ్, గజభింకర్ పవన్, బుసరపు సంపత్, చిట్టవేని సదయ్య, శేఖర్ మాస్టర్, భాగ్యలక్ష్మీ, మాటూరి లత, ఇనుగుల శ్రీనివాస్, ఆగండ్ల శంకర్, ఆగండ్ల రాజు, ఆగండ్ల గట్టయ్య, రవిచంద్ర, పిట్టల వెంకటేష్, సాయి కిరణ్ , మహేష్ పటేల్, వేముల శ్రీనివాస్, మెండ శంకరయ్య, అరవింద్ రెడ్డి, వంశీ, వినయ్, నల్ల సంపత్, మేకల శ్రీనివాస్, శ్రీగిరి సుధాకర్, ఎల్ల మల్లేశం, నార్ల శ్రీనివాస్, పోచంపల్లి ఈశ్వర్, కిరణ్, గొసుగుల రవి, సతీష్ శ్రీవాణి, లింగయ్య, నారాయణ తదితరులు అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు.