2 September, 2026 | 6:08 PM

యూజీడీతో పారిశుద్ధ్య సమస్యలకు చెక్

02-09-2026 | 04:47pm

శ్రీనివాస కాలనీలో రూ.10.32 కోట్లతో పనులకు శంకుస్థాపన

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను విస్తరిస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 21వ డివిజన్ శ్రీనివాస కాలనీలో రూ.10.32 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న యూజీడీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. యూజీడీతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జి గోనెల శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలీ, 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్, ఇతర కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.