2 September, 2026 | 6:50 PM

నర్సు అత్యాచారం కేసును సుమోటోగా విచారించిన ఎన్‌సీడబ్ల్యూ

02-09-2026 | 06:04pm

న్యూఢిల్లీ: ఆదివాసి మహిళ నర్సు శిరీషపై జరిగిన అత్యాచారం కేసును జాతీయ మహిళా కమిషన్(National Commission for Women) సుమోటోగా విచారించింది.  నర్సు అత్యాచారం ఘటనపై వారం రోజులోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్(NCW Chairperson Vijaya Rahatkar)  రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కేసులో వేగవంతమైన దర్యాప్తు చేయాలని ఎన్సీడబ్ల్యూ సూచనలు జారీ చేసింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలను భద్రపర్చాలని, 7 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలని పోలీసులకు ఆదేశించింది.