2 September, 2026 | 5:36 PM

విలేకరులను దూషించిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి

02-09-2026 | 04:48pm

సర్పంచ్ పై రేగొండ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు

భూపాలపల్లి/ రేగొండ, సెప్టెంబర్ 02 (విజయ క్రాంతి): రేగొండ మండలంలోని నారాయణపూర్ గ్రామ సమస్యలపై వార్తలు ప్రచురించినందుకు ఆ గ్రామ సర్పంచ్ గైకోటి రవీందర్ విలేకరులను దూషిస్తూ, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మండల విలేకరులు ఆరోపించారు. ఘటనపై రేగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న రేగొండ మండల కేంద్రంలోని ఓ బేకరీ వద్ద పలువురు నాయకులు, విలేకరుల సమక్షంలో బండి కమలాకర్‌తో పాటు వార్తలు ప్రచురించిన విలేకరులను దూషించారని తెలిపారు. ఈ ఘటనపై రేగొండ ఎస్‌ఐకి ఫిర్యాదు చేసి, సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు