12 May, 2026 | 3:50 PM

ఏబీ స్విచ్‌లతో విద్యుత్ అంతరాయాలకు చెక్

12-05-2026 03:31 PM

ఎస్ఈ ఉత్తమ్ జాడే

ఆసిఫాబాద్(విజయక్రాంతి): సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు ఏబీ స్విచ్‌ల ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. గ్రామాలు, త్రిఫేజ్ లైన్లలో ఏబీ స్విచ్‌లు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడైనా లైన్ ఫాల్ట్ ఏర్పడితే మొత్తం గ్రామానికి విద్యుత్ నిలిపివేయకుండా, సమస్య ఉన్న ప్రాంతానికే పరిమితం చేయగలుగుతున్నామని చెప్పారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు, చెట్ల కొమ్మలు తగలడం వంటి కారణాలతో ఏర్పడే అంతరాయాలను త్వరగా గుర్తించి మరమ్మతులు చేపట్టేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతోందన్నారు. ఏబీ స్విచ్‌లతో ట్రిప్పింగ్ సమస్యలు తగ్గి, వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతోందని వివరించారు. మరమ్మతు పనుల సమయంలో సిబ్బంది భద్రత కూడా మెరుగుపడుతోందన్నారు. అత్యవసర విద్యుత్ సమస్యల కోసం వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని సూచించారు.