30 August, 2026 | 1:46 AM

గ్రాంధిక భాషపై గిడుగు పిడుగై.. వ్యవహారిక తెలుగుకు పట్టం

30-08-2026 12:00 AM

స్కూల్ కరెస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి 

ముషీరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): గ్రాంధిక భాషకు పరిమితమైన తెలుగు రచనా సంప్రదాయాన్ని ప్రశ్నించి, సామాన్యులు మాట్లాడే వ్యావహారిక భాషకు గిడుగు రామమూర్తి పంతులు గౌరవం తీసుకువచ్చారని వక్తలు కొనియాడారు. గిడుగు జయంతిని పురస్కరించుకుని శనివారం కవాడిగూడ ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ లో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నోట పలికే భాషే సజీవ భాష అని చాటిన గిడుగు సేవలు చారిత్రాత్మకమన్నారు.

విద్యార్థులకు అర్థమయ్యే భాషలో విద్యాబోధన, ప్రజలకు అర్థమయ్యే భాషలో పరిపాలన సాగాలన్న ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇతర భాషలు నేర్చుకున్నా మాతృభాషను విస్మరించకూడదని సూచించారు. కుటుంబం నుంచే తెలుగు భాషను ప్రోత్సహించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ యాస, భాషకు ప్రచురణ, ప్రసార మాధ్యమాలు, సినిమాలు, సీరియల్స్, గేయాలు, కథలు, కావ్యాల్లో మరింత ప్రాధాన్యత లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపల్ పి. స్వర్ణలత, మాధవి, విజయ్కుమార్, భాస్కర్, జెసింతా, రత్నప్రభ తదితరులు పాల్గొన్నారు.