17 March, 2026 | 2:43 AM

మూడు రాష్ట్రాల్లో బీజేపీకి సవాళ్లు!

17-03-2026 12:12 AM

దుప్పటి మొగిలి :

భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి కేవలం అధికార మార్పిడి కి సంబంధించిన రాజకీయ ప్రక్రియ మా త్రమే కాదు. ప్రజల ఆశలు, ఆవేదనలు, అభిప్రాయాలు, భవిష్యత్ ఆశయాలను ప్రతి బింబించేవి కూడా. భారత ఎన్నికల కమిషన్ తాజాగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేర ళం, అసోం రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అసోంలో ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ, మరోసారి అ ధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు.

అలాగే, మెయిన్ స్ట్రీం రాజకీయాల్లో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికలు పెద్దగా పరిగణలోకి తీసుకునేవి కావు. ఇక మిగిలిన కేరళం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రా ల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం, తద్వా రా తన బలాన్ని నిరూపించుకోవడం బీజేపీ కి ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఎం దుకంటే ఆ మూడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పా ర్టీలు బలంగా ఉంటాయి. అధికారం కూడా వాటి మధ్యే చేతులు మారుతుంటాయి. వాటి పునాదులు కూడా ప్రజల మద్దతుతో పటిష్టంగా ఉంటాయి. ఇలాంటి అడ్డుగోడలను ఎదుర్కోవడం బీజేపీకి పెద్ద టాస్కే!

అధికార పార్టీల ఎత్తుగడలు 

బీజేపీ జాతీయవాదం, హిందుత్వ వ్యూ హాలను తిప్పికొట్టడానికి బెంగాల్, తమిళనా డు, కేరళంలోని అధికార పార్టీలు సంక్షేమ పథకాలను, ప్రాంతీయవాదాన్ని ప్రధాన అ స్త్రాలుగా వాడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే తన నజరానాల వ్యూహంతో రంగంలోకి దిగారు. హిందూ పురోహితులకు, ముస్లిం మౌజన్లకు గౌరవ వేతనాన్ని పెంచడం ద్వారా ఆమె మతపరమైన విమర్శలకు తావు లేకుండా జాగ్రత్తపడుతున్నారు.

తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్ మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం వంటి పథకాల ద్వారా ప్రజల్లో తన పట్టును నిలుపుకుంటున్నారు. కేంద్రం నుం చి రావాల్సిన నిధులు, రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడబోమని చెప్పడం ద్వారా వీరు బీజేపీ వ్యూహాలను సమర్థంగా తప్పు పడుతున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కా ర్ ప్రచారానికి వ్యతిరేకంగా, రాష్ట్ర స్వయంప్రతిపత్తిని, హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.

బీజేపీ వ్యూహాలు

ఆయా రాష్ట్రాల్లో ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ బీజేపీ తన ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ను ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవా లని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. కేంద్ర ప్రభు త్వ పథకాల అమలులో లోపాలు, తృణమూల్ నేతల అవినీతి ఆరోపణలను బీజేపీ ప్రధాన అస్త్రాలుగా చేసుకుంటున్నది. తమిళనాడులో కూడా ఈసారి ఆ పార్టీ అన్యాప దేశంగా తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది.

జాతీయ భద్రత, సరిహద్దుల రక్షణ, అవినీతి వ్యతిరేక పాలన వంటి అంశాలను ఆ పార్టీ ప్రచారంలో పెడుతోంది. అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల నిర్మాణంపై బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది. అయితే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఓటు శాతాన్ని పెంచుకోవడం ద్వారా భవిష్యత్ రాజకీయాలకు పునాది వేయాలని బీజేపీ భావిస్తోంది.

బెంగాల్ రాజకీయ పరిణామాలు

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే.. అక్కడ దశాబ్ద కాలంలో జరిగిన మార్పులు అనేకం ఉన్నాయి. 34 సంవత్సరాల పాటు కొనసాగిన వామపక్ష పాలనను 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ముగించింది. అప్పటి నుంచి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకురాలిగా నిలిచారు. ఆమె ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజల్లో మంచి ఆదరణ పొందాయి.

ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహించే కన్యాశ్రీ పథ కం అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. మహిళల వివాహానికి సహాయం చేసే రూపశ్రీ పథకం, ఆరోగ్య బీమా అం దించే స్వస్థ్య సాథీ వంటి కార్యక్రమాలు ప్రజ ల జీవితాల్లో ప్రభావం చూపాయి. హిందూ పురోహితులకు, ముస్లిం మూజన్లకు గౌరవ వేతనాన్ని పెంచడం ద్వారా మమత సామాజిక సమతుల్యతను కాపాడాలని చూస్తున్నా రు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చాయి.

బీజేపీ ప్రధానంగా జాతీయత, అభివృద్ధి, అవినీతి వ్యతిరేక రాజకీయాలను ప్రచారంలో ముందుకు తీసుకువస్తోంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ అ వినీతి ఆరోపణలు, పరిపాలనా లోపాలను ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయాలను ఆధిపత్యం చేసిన వామపక్షాలు ఇప్పుడు బలహీనపడ్డాయి. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రె స్తో కలిసి పోటీ చేయడం ద్వారా తమ పాత స్థావరాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.

తమిళనాడులో - కొత్త శక్తులు

తమిళనాడు రాజకీయాల్లో ద్రావిడ సి ద్ధాంతాల ప్రభావం దశాబ్దాలుగా కొనసాగుతోంది. డీఎంకే మరియు ఎఐఎడీఎంకే అనే రెండు ప్రధాన పార్టీలు ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్య మంత్రి ఎం.కే. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం మహిళల సంక్షేమం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టింది. విద్యార్థులకు స్కాలర్షి ప్లు, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం వం టి కార్యక్రమాలు అమలవుతున్నాయి. అయి తే ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఒక కొత్త రాజకీయ శక్తి ప్రవేశించింది.

సినీ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. విజయ్కు యువతలో విపరీతమైన అభిమాన వర్గం ఉంది. అవినీతి వ్యతి రేక రాజకీయాలు, సామాజిక న్యాయం వం టి అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. జ యలలిత మరణం తర్వాత ఎఐఎడీఎంకే కొంత బలహీనపడినా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత పట్టుంది. బీజేపీ పొత్తులతో తమిళనాడు ఎన్నికలు మూడు ప్రధాన రాజకీయ శక్తుల మధ్య జరిగే ఆసక్తికర పోటీగా మారే అవకాశం ఉంది.

మిగిలిన రాష్ట్రాల్లో

కేరళ రాజకీయాలు భారతదేశంలోనే ఎంతో ప్రత్యేకమైనవి. అక్కడ కమ్యూనిస్టు పార్టీలు నేతృత్వం వహించే ఎల్డీఎఫ్ కూట మి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించే యూ డీఎఫ్ కూటమి మధ్యే ప్రధాన పోటీ సాగుతుంది. సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యా రంగాల్లో సాధించిన విజయాలను తమ ప్రచార అస్త్రాలుగా వాడు కుంటున్నది. ప్రతిపక్షం మాత్రం నిరుద్యో గం, ఆర్థిక లోటు వంటి అంశాలను ప్రస్తావిస్తోంది. అస్సాం రాష్ట్రంలో గత దశాబ్దంలో బీజేపీ ప్రధాన శక్తిగా ఎదిగింది.

ముఖ్యమం త్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో అభివృద్ధి, మౌలిక వసతులు, జాతీయ భద్రత వంటి అంశాలు ప్రచారంలో ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టం, వలస సమస్యలు ఇక్కడ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీకి సవాల్ విసరాలని చూస్తోంది. పుదుచ్చేరి చిన్న ప్రాంతం అయినప్పటికీ రాజకీయంగా చాలా ప్రాధాన్యం కలిగి ఉం ది. అక్కడ స్థిరమైన ప్రభుత్వం కావాలనే భావన ప్రజల్లో బలంగా కనిపిస్తోంది.

జాతీయ రాజకీయాలపై ప్రభావం

మొత్తానికి ఎన్నికలు జాతీయ రాజకీయాల దిశను నిర్ణయిస్తాయి. దక్షిణ భారతదేశంలో బీజేపీ విస్తరణ అవకాశాలు, కాంగ్రెస్ పునరుద్ధరణ ఈ ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నా, జాతీయ రాజకీయ సమీకరణాల్లో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో యువ ఓటర్ల సంఖ్య పెరగడం వల్ల ఉద్యోగాల కల్పన, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలు కీలకం కానున్నాయి. సోషల్ మీడియా ద్వారా సాగే ప్రచారం యువతను ఆకర్షించేలా ఉంది.

మహిళా ఓటర్ల పాత్ర కూడా గణనీయంగా పెరిగింది. మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలు ప్రచారంలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాస్వామ్య సమరం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెర తీయనుంది. ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ దిశను నిర్దేశించబోతున్నాయి.

 వ్యాసకర్త సెల్: 8466827118