6 May, 2026 | 10:18 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

పెళ్లి పత్రికలు పంచడం కోసమని వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లిన చైన్ స్నాచర్

17-12-2025 08:10 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పెళ్లి పత్రిక ఇవ్వాలని ఇంటికి వచ్చిన ఓ దుండగుడు ఓ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మెడలో ఉన్న పుస్తెలతాడును లక్కేల్లాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలోని ఈశ్వర్ కాలనీలో నివాసం ఉంటున్న చంద్రకళ అనే మహిళ ఇంట్లో టీవీ చూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి పెళ్లి కార్డు ఇవ్వడం కోసం వచ్చానంటూ డోర్ కొట్టాడు.

డోర్ తెరిచిన వెంటనే మహిళపై దాడి చేస్తూ నోట్లో గుడ్డలుకుక్కి తన మెడలో ఉన్న 2తులాల బంగారు పుస్తెలతాడు బలవంతంగా లాక్కెళ్లాడు. ఈ పెనుగులాటలో మహిళ మెడపై గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులకు తెలపడంతో పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు.