calender_icon.png 20 February, 2026 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

20-02-2026 09:50:46 PM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట,(విజయక్రాంతి): పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. 

అదేవిధంగా మామిడిపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కటమయ్య కీట్లను (సేఫ్టీ మోకులు) అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య,వైస్ చైర్మన్ తాళ్లపెల్లి ప్రభాకర్,సర్పంచ్ కుంటెల్లి నాగరాజు,మామిడిపెల్లి సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఫాష,తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ద,నాయకులు గొట్టే రుక్మిణి,బండ నర్సయ్య,కార్యకర్తలు