పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్
25-03-2026 02:30 PM
క్లారిఫికేషన్ పేరుతో ఇంధన శాఖ ప్రకటన..
ఎల్పీజీ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవు..
న్యూఢిల్లీ: ఎల్పీజీ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రకటించింది. క్లారిఫికేషన్ పేరుతో ఇంధన శాఖ ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి వదంతులు నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. సిలిండర్ బుకింగ్(Cylinder Booking)ల మధ్య సమయాలు ఇప్పటికే నిర్ధరించి ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. సిలిండర్ బుకింగ్ కు పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులు గడువు విధించినట్లు పునరుద్ఘాటించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చెప్పిన గ్యాస్ ఎజెన్సీల వద్ద సిలిండర్లు పట్టుకుని వంట గ్యాస్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు.




