కపాస్‌పై కేంద్ర సదస్సు
- పత్తి రంగానికి రూ. 5,659 కోట్ల బడ్జెట్
- టెస్టింగ్ ఫీజును 10 వేల నుంచి వెయ్యికి తగ్గించాలి
- తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘కపాస్ క్రాంతి మిషన్’ పై కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవా రం జాతీయ స్థాయి ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశం జరిగింది. కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ జాయింట్ సెక్రటరీ (ఫైబర్) పద్మిని సిగ్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీ సీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల జిన్నర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసి డెంట్ బొమ్మినేని రవీందర్‌రెడ్డి పాల్గొని రాష్ట్ర పత్తి పరిశ్రమ, రైతుల తరపున పలు కీలక సూచనలు చేశారు. దేశంలో పత్తి రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం 2026 నుంచి 2030 కాలానికి గానూ కేంద్ర క్యాబినెట్ రూ.5,659.22 కోట్ల భారీ బడ్జెట్ అంచనాతో ఈ మిషన్‌కు ఆమోదం తెలిపిందని ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా జిన్నింగ్ పరిశ్ర మలకు అవుట్పుట్ ఆధారిత మద్దతు ఇవ్వడంపై, అలాగే భారతీయ పత్తి బ్రాండ్ ‘క స్తూరి కాటన్ భారత్‘ బేళ్ల వ్యాపారం కోసం ప్రత్యేక ఈ- పోర్టల్‌ను తీసుకురావడంపై చర్చించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ‘తెలంగాణ పత్తి నూలు తయారీకి ఎంతో అనువైనది. పాలిస్టర్ సంచుల వల్ల పత్తిలో వ్యర్థాలు పెరుగు తున్నాయి. దీనిని అరికట్టడానికి రైతులకు కాటన్ క్యాప్స్, కాటన్ సంచులను ఉచితంగా లేదా రాయితీపై అందించాలి.
గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టాలి. నకిలీ, నా ణ్యత లేని విత్తనాల వల్ల పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. విత్తే సమయానికి ముందే రైతులకు ధృవీకరించబడిన విత్తనాలపై అవగాహన కల్పించాలి. పత్తి సాగులో బిందు సేద్యంతో షార్ట్ ఫైబర్, వ్యర్థాల సమస్యను అధిగమించవచ్చు.
పత్తి నాణ్యత పరీక్ష కోసం ప్రతిపాదించిన రూ.10 వేల ఫీజు రూ.500 నుంచి వెయ్యికి తగ్గించాలి. పాత జిన్నింగ్ మిల్లుల్లో కాలుష్య నివారణ యంత్రాలు ఏర్పాటు చేసుకోవడానికి 75% సబ్సిడీ ఇవ్వాలి. కస్తూరి కాటన్ బేళ్లను కొనుగోలు చేసి ఎగుమతి చేసే మిల్లులకు ప్రత్యేక రాయితీలు ఇస్తే, వారు మార్కెట్లో రైతులకు మంచి ధరలు చెల్లిస్తారు.






