28 April, 2026 | 7:50 AM

బాలబాలికల చట్టాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్, అదనపు కలెక్టర్

28-04-2026 01:37 AM

మేడ్చల్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): బాల బాలికల చట్టాల గురించి అవగాహన కల్పించడానికి రూపొందించిన ప్రచార రథాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ గ్రామాన, వాడ వాడల్లో ప్రచారంలో భాగంగా బాల్య వివాహాల గురించి, అక్రమ దత్తత గురించి, బాలలపై జరిగే లైంగిక వేధింపుల గురించి ప్రచారం చేయాలన్నారు.

ఎక్కడైనా పిల్లలపై అఘాయిత్యాలు జరిగితే వెంటనే 1098 కి సమాచారం ఇవ్వాలని అన్నారు. మాదకద్రవ్యాలను పిల్లల దూరంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 67 చైల్ కేర్ ఇన్స్టిట్యూషన్ ఉండగా, మొత్తం1800 పిల్లలు ఉన్నారని,

ఇందులో అనాధ పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు, కులదృవీకరణ పత్రాలు, ఆధార్ కారడ్స్, సదరన్ సర్టిఫికెట్లను జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి పిల్లలకు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా విద్యాశాఖ, జిల్లా  కార్మిక శాఖ బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ తిరుమల దేవి , సిడబ్ల్యూసీ మెంబర్ రామ్మోహన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఇంతియాజ్ రహీం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.