నాతో పండుగ జరిపెయ్..
యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యాన్ప వెంకట్ కే నారాయణ నిర్మించిన చిత్రం ’కేడీ : ది డెవిల్’. ఈ మూవీని దర్శకుడు ప్రేమ్స్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, వీ రవిచంద్రన్, రమేశ్ అరవింద్, రీష్మా నానయ్య తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ సందర్భంగా మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా ఓ మాస్ బీట్ను విడుదల చేశారు. నోరా ఫతేహీ, సంజయ్ దత్ కాంబోలో వచ్చే ఈ మాస్ బీట్ యూత్ను ఉర్రూతలూగించేలా ఉంది. ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు.
ఈ పాటను తెరకెక్కించిన తీరు, కంపోజ్ చేసిన స్టెప్పులు, నోరా ఫతేహీ గ్లామర్ ట్రీట్ ప్రేక్షకులకు కిక్కిచ్చేలా ఉన్నాయి. అర్జున్ జన్య ఇచ్చిన మాస్ బాణీకి, మంగ్లీ గాత్రం మరింతగా తోడైంది. ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఎంతో సరళంగా, వినసొంపుగా ఉంది. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట విజువల్ ట్రీట్లా మారింది.




