వెల్ వెల్.. సీక్వెల్!
* సీక్వెల్ సినిమా అంటేనే ఫ్రీ హైప్. మినిమం బిజినెస్. అందుకే అదే క్రేజ్ వర్కౌట్ అవుతోందనే అందరూ సీక్వెల్స్ చేస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్స్ సందడి తెలుగులోనే కాదు. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమల్లోనూ కనిపిస్తోంది. బాలీవుడ్‌లో యువ హీరోలు సీక్వెల్ సినిమాలు చేస్తున్నారు. కొందరు సీనియర్లు అయితే తమ కెరీర్ అంతా సీక్వెల్స్‌తోనే కొనసాగిస్తున్నారు.
హీరోలంతా ఇప్పుడు సీక్వెల్ సినిమాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. సౌత్, నాన్ తెలుగు స్టార్లు అంతా వరుసపెట్టి సీక్వెల్స్ చేస్తున్నారు. సీక్వెల్స్ చేస్తున్న హీరోల జాబితాలో సీనియర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం సీక్వెల్స్ సినిమాల పనుల్లోనే బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలిప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే.
ఈ సినిమా సీక్వెల్ పనుల్లోనే రజనీ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ‘జైలర్ 2’ పేరుతో తెరకెక్కుతోందీ సినిమా. ఈ చిత్రంతోపాటు క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ‘నరసింహ’ చిత్రానికి కూడా సీక్వెల్ పనులు ప్రారంభమయ్యాయని ప్రకటించారు మేకర్స్. అయితే, ‘జైలర్ 2’ మీద మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి.
టాలీవుడ్‌లో దాదాపు 40కి పైగా సీక్వెల్స్
తెలుగులో చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్ సినిమాల ట్రెండ్ జోరుగా సాగుతోంది. బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన అనేక చిత్రాలకు కొనసాగింపుగా పార్ట్ 2, పార్ట్ 3 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. భారీ అంచనాలున్న పాన్ ఇండియా సీక్వెల్స్‌లో ‘దేవర 2’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ సినిమా షూటింగ్ ఇదే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రావాల్సి ఉంది. ఇందులో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. ‘కల్కి 2898 ఏడీ’కి పార్ట్ 2 కూడా రావాల్సి ఉంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి రెండో భాగం రానుంది. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్‌లో భాగంగా ‘హిట్ 4’ సినిమా రూపొందుతోంది.
అడవి శేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’. దీనికి సీక్వెల్‌గా ‘జీ 2’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ’. ఈ సిరీస్‌లో మూడో భాగం రానుంది. ఇంకా సాయిదుర్గా తేజ్ ‘విరూపాక్ష’కు సెకం డ్ పార్ట్, అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మంగళవారం’ చిత్రానికి రెండో భాగం ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇలా ప్రస్తుతం దాదాపు 40కి పైగా సీక్వెల్ చిత్రాలు వివిధ దశల్లో ఉన్నట్లు సమాచారం.
వరుసపెట్టి సీక్వెల్స్ చేస్తున్న తమిళ హీరోలు..
తమిళంలో వరుసపెట్టి సీక్వెల్ సినిమాలు చేస్తున్న హీరో కార్తి. ఆయన చేతిలో ప్రస్తుతం పలు సీక్వెల్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో చెప్పుకోదగ్గవి ‘సర్దార్ 2’, ‘ఖైదీ 2’ ఉన్నాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా కార్తి చేసిన ఖైదికి సీక్వెల్‌గా ఖైదీ 2 ప్రకటించారు. అయితే, ఖైదీ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఈ సినిమా రావటం పక్కా అంటున్నారు హీరో కార్తి.
సర్దార్‌కు సీక్వెల్‌గా సర్దార్ 2 కూడా కార్తి నుంచి విడుదల కానున్న సినిమాల జాబితాలో ఉంది. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీకి కోసం చూస్తున్నారు. తొలిభాగం తెలుగు, తమిళంలో మంచి హిట్ కావటంతో సీక్వెల్ మీద కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
దక్షిణాది ఇతర పరిశ్రమల్లోనూ దండిగా సీక్వెల్స్..
యష్ కూడా వరుసపెట్టి సీక్వెల్ సినిమాలు చేస్తున్నా రు. ఇప్పటికే కేజీఎఫ్, కేజీఎఫ్ 2తో సంచనాలు సృష్టించిన యష్ కేజీఎఫ్ 3 కూడా ఇదే సంవత్సరం పట్టాలెక్కిం చనున్నారు. ఈ సినిమాతోపాటు టాక్సిక్ సినిమాకూ సీక్వెల్ ఉంటుందన్న టాక్ వినవస్తోంది. యష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా స్కేల్ కూడా పెద్దదిగా కని పిస్తుండటంతో ఈ సినిమాకు కూడా సీక్వెల్ ఉందని సమాచారం. ఇక మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కూడా వరుసపెట్టి సీక్వెల్ సినిమాలు చేస్తున్నారు.
ప్రస్తు తం ఆయన మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నా రు. వీటిలో ఒకటి తెలుగు సినిమా కావటం విశేషం. తెలుగులో ప్రభాస్, పృథ్వీరాజ్ కలయికలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాకు సీక్వెల్‌గా సలార్ 2 రాబోతోంది. తొలిభాగం కంటే సెకండ్ పార్ట్‌లోనే పృథ్వీరాజ్ పాత్రను ఎక్కువగా చూపించబోతున్నారు.
కన్నడ, తెలుగులో తెరకెక్కుతున్న ‘సలార్ 2’తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు మలయాళంలో మోస్ట్ వెయిటింగ్ సీక్వె ల్స్ తెరకెక్కుతున్నాయి. వీటిలో అతిపెద్ద హిట్ అయిన ‘మెమొరీస్’కు సీక్వెల్‌గా ‘మెమొరీస్ 2’ను ఇటీవలే ప్రకటించారు పృథ్వీరాజ్. దీనికితోడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లూసీఫర్’ థర్డ్, అండ్ లాస్ట్ పార్ట్ కూడా పృథ్వీరాజ్ సీక్వెల్స్ లిస్టులో ఉంది.
బాలీవుడ్‌లో సీక్వెల్స్ హవా..
ప్రత్యేకంగా బాలీవుడ్ అయితే సీక్వెల్స్‌లో మునిగితేలుతోంది. సీనియర్ల నుంచి యువ కథానాయకుల వర కు వరుసపెట్టి సీక్వెల్ సినిమాలతోనే ప్రయాణం చేస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా చాలా మంది హీరోలు ఎక్కువ మొత్తంలో సీక్వెల్ సినిమాలు చేసే పనిలో బిజీగా ఉన్నా రు. రణ్‌వీర్ సింగ్ కూడా ఇప్పుడున్న సీక్వెల్‌కు మరొకటి జోడించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆదిత్యధర్ దర్శకత్వంలో ‘ధురంధర్’ రికార్డు కలెక్షన్లతో అదరగొట్టింది.
ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ధురంధర్ 2’ సిద్ధమవుతోంది.ఈ రెండోభాగం మార్చి 19న విడుదల కానుంది. రణ్‌వీర్ సింగ్ మోస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘డాన్’కు కూడా సీక్వెల్ చేయాల్సి ఉంది. బాలీవుడ్ టాప్ మోస్ట్ సినిమాల్లో ఒక్కటైన ‘డాన్ 2’కు సీక్వెల్ ‘డాన్ 3’ కూడా లైన్‌లో ఉంది. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ తర్వాత డాన్‌గా రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా మూడో భాగాన్ని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
రణ్‌బీర్ కపూర్ కూడా రెండు భారీ సీక్వెల్ సినిమాలు చేస్తున్నారు. అందులో భారతదేశలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ ఒకటి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ అందరూ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి తొలిభాగం ఇదే ఏడాది దీపావళికి విడుదల కానుంది.
ఇక సెకండ్ పార్ట్‌ను 2027 దీపావళికి విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రణబీర్ కపూర్ చేయాల్సిన మరో సీక్వెల్ ‘యానిమల్ పార్క్’. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద రూ. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టడం ద్వారా పాన్‌ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా లో రణబీర్ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే సందీప్‌రెడ్డికి ఉన్న ఇమేజ్, ‘యానిమల్’తో ఏర్పడిన క్రేజ్ కార ణంగా ‘యానిమల్ 2’పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
సందీప్‌రెడ్డి ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తెరకెక్కిస్తున్నా రు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఇదే ఏడాది ‘యానిమల్’ సీక్వెల్‌ను పట్టాలెక్కించనున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్ జాబితాలో ఎక్కువగా సీక్వెల్ సినిమాలే ఉన్నాయి. ‘రైడ్’తో మంచి హిట్ అందుకున్న అజయ్ దేవగణ్ ‘రైడ్ 2’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు ‘రైడ్ 3’ చిత్రాన్ని సైతం రూపొందించనున్నట్టు ప్రకటించారు.
అజయ్ దేవగణ్ లిస్టులో ఉన్నవాటిల్లో రితేశ్ దేశ్‌ముఖ్, అర్షద్, జావీద్‌తో కలిసి చేస్తున్న మరో సీక్వెల్ సినిమా ‘ఢమాల్ 4’ ఉంది. బాలీవుడ్ క్రేజీ కామె డీ ఎంటర్‌టైన్‌మెంట్ సిరీస్‌లో వచ్చిన మూవీ ‘ఢమాల్’ సీక్వెల్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో ‘ఢమాల్ 4’ను మరోస్థాయి కామెడీతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇదే ఏడాది జూలై 3న విడుదల కానుంది. ఇక అజయ్ దేవగణ్ మరో సీక్వెల్ ‘గోల్‌మాల్ 5’ కూడా చేస్తున్నారు. ఈ సినిమాతోపాటు మలయాళ సినిమా ‘దృశ్యం 3’ని ఈ సంవత్సరం అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు.
అక్షయ్ కుమార్ కూడా బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్ సినిమాలే చేస్తున్నారు. సునీల్ శెట్టి, పరేష్ రావల్, అభిషేక్ బచ్చ న్ క్రేజీ కాంబోలో వచ్చిన హిలేరియస్ కామెడీ ఎపిక్ ఎంటర్‌టైనర్ ‘హీరా ఫేరీ’. ఈ సినిమాకు సంబంధించి రెండు భాగాల తర్వాత రూపొందుతున్న ‘హీరా ఫేరీ 3’ ఈ ఏడాది విడుదలయ్యే సినిమాల జాబితాలోనే ఉం ది. వీటితోపాటు ‘భాగమ్ భాగ్ 2’, ‘ఓ మై గాడ్ 3’ లాం టి సీక్వెల్ సినిమాలను అక్షయ్‌కుమార్ పూర్తి చేయాల్సి ఉంది.




