16 March, 2026 | 2:49 AM

బాలీవుడ్‌లో మరో చాన్స్

16-03-2026 12:44 AM

సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేశ్ ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో సినిమాలు చేసిన ఆమె ఇటీవల హిందీ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె న టించిన మరో హిందీ సినిమా ‘రఫ్తార్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావుకు జంటగా కీర్తి సురేశ్ నటించిన తాజా చిత్రం ‘రఫ్తార్’. వెండితెరపై ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. ‘రఫ్తార్’ సినిమాను జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. యాక్షన్, ఎమోషన్ మిళితంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎ క్యాంపె ఫిలమ్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. దర్శకుడు ఆదిత్య నింబల్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రానికి రాజ్కుమార్ రావు భార్య పత్రలేఖ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి హీరో, హీరోయిన్ ఫస్ట్ లుక్లు విడుదల కాకపోయినా పోస్టర్ను బట్టి ఇది డెప్త్ ఉన్న కథగా ఉండబోతుందని తెలుస్తోంది. సినిమాలో రాజ్కుమార్ రావు ఓ యువకుడిగా కనిపించగా, అతనికి సమానంగా పోటీ ఇచ్చే బలమైన పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుందని సమాచారం. కథకు అనుగుణంగా విభిన్నమైన పాత్రలు ఈ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘రఫ్తార్’ సినిమా ద్వారా కీర్తి సురేశ్ మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.