21 March, 2026 | 2:15 AM

శ్రీరాంపురం ఎస్టీ కాలనీని సందర్శించిన సీడీపీవో రేవతి

21-03-2026 12:28 AM

బూర్గంపాడు, మార్చి20, (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీని సీడీపీవో రేవతి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై గ్రోత్ మానిటరింగ్ చేపట్టి, వారికి టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేశారు. కాలనీలో కొత్త అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆమె వెల్లడించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్,సిబ్బంది పాల్గొన్నారు.