సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
16-07-2026 01:36 AM
మఠంపల్లి, జులై 15 :మండల కేంద్రములో 10 లక్షల రూపాయలతో కొత్త సీసీ రోడ్డు నిర్మాణ పనులను మఠంపల్లి గ్రామపంచాయతీ స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో రానున్న రోజు ల్లో గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి చెస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి శౌరి,కార్యదర్శి వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నె వెంకటేశ్వర్లు, బుచ్చయ్య,వార్డు సభ్యులు బొడ్డు భవాని, కాటిపల్లి నాగరాజు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






