7 July, 2026 | 2:23 PM

తడికలపూడిలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

07-07-2026 01:02 PM

అధ్యక్షుడిగా జజ్జర రామనాధం ఏకగ్రీవ ఎన్నిక

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం తడికలపూడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కినేని శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి కమిటీలు పార్టీ బలోపేతానికి వెన్నెముక లాంటివని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

అనంతరం గ్రామ శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా జజ్జర రామనాధం, ఉపాధ్యక్షులుగా వాసం అనిల్, గుగులోత్ రవి ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శులు, కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో మండల నాయకుడు ఈది గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.