కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలి
కొత్త,పాత నేతలను కలుపుకు పోవాలి
ఎమ్మెల్యే కశిరెడ్డి పిలుపు
అమనగల్లు, జులై 7(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ( Congress party) పటిష్టతకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(Kalwakurthy MLA Kasireddy Narayana Reddy) పిలుపునిచ్చారు. అమనగల్లు, మాడ్గుల్, కడ్తాల్, తలకొండపల్లి మండలాల నూతన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డి, శంకర్, కిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివలింగంలను ఆయన నివాసం లో శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయా మండలాల మాజీ అధ్యక్షులను కూడా సత్కరించి, పార్టీకి వారు చేసిన సేవలను కొనియాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ సభ్యులు రఘురాములు,శ్రీనివాస్ రెడ్డి, మానయ్య చేగురి వెంకటేష్‌లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






