అక్రమంగా ఎడ్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
13-04-2026 12:54 AM
నాగిరెడ్డిపేట్,ఏప్రిల్ 12 (విజయక్రాంతి): అక్రమంగా ఎడ్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు.స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... లింగంపేట్ నుండి సంగారెడ్డి వైపు అక్రమంగా పది ఎడ్లను తరలిస్తున్న వాహనాన్ని నాగిరెడ్డిపేట్ మండల ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ మండలంలోని తాండూర్ గ్రామ శివారు పరిధిలో పట్టుకోవడం జరిగింది.
ఈ మేరకు ఎస్‌ఐ.భార్గవ్ గౌడ్ డ్రైవర్ సాయిలు మరియు యజమాని అబ్దుల్ రహీంలపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.సీజ్ చేసిన ఎడ్లను మెదక్ పట్టణంలోని గోశాలకు తరలించి భద్రపరచడం జరిగిందని ఎస్‌ఐ.భార్గవ్ గౌడ్ అన్నారు.




