13 April, 2026 | 2:32 AM

తాడ్వాయిలో ఇందిరమ్మ గృహప్రవేశాలు

13-04-2026 12:56 AM

తాడ్వాయి, ఏప్రిల్, 12( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఆదివారం ఇందిరమ్మ పథకంలో నూతనంగా నిర్మించుకున్న లబ్ధిదారుల ఇందిరమ్మ గృహప్రవేశాలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని తెలిపారు.

పేదలకు కావాల్సిందల్లా ఉండడానికి ఇల్లే ముఖ్యమని వారు తెలిపారు. ఆ ఇంటి కల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలోనే జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి, కన్ కల్,సంతాయిపేట గ్రామాల్లో నాయకులు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు ఆకిటి వెంకట్ రామ్ రెడ్డి, అంబీర్ శ్యాం రావు, సంజీవులు, రాజేశ్వర్ రెడ్డి, నర్సారెడ్డి,ప్రతాపరెడ్డి, షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.