13 April, 2026 | 2:27 AM

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

13-04-2026 12:53 AM

ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారం నూతన గృహం ఇందిరమ్మ ఇల్లు ప్రవేశం, చేసిన ఎఎంసి చైర్మన్, రజిత వెంకటరామిరెడ్డి

ఎల్లారెడ్డి ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారం ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతన గృహప్రవేశం చేసి లబ్ధిదారులకు వస్త్రాలను సమర్పించారు.

లబ్ధిదారుడు నూతన గృహప్రవేశానికి వచ్చిన నాయకులకు శాసనసభ్యులు మదన్మోహన్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం మాజీ అధ్యక్షులు బోన్ల సాయిలు తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కురుమ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.