29 July, 2026 | 9:24 AM

కారు బోల్తా... ముగ్గురికి తీవ్ర గాయాలు

29-07-2026 08:24 AM

కల్వర్టును ఢీకొని అదుపు తప్పిన కారు నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు 

నసురుల్లాబాద్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్గి శివారులోని నర్సింగ్ కళాశాల ఎదుట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కలవటును ఢీకొని బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బోధన్ మున్సిపల్ చైర్మన్ కుటుంబ సభ్యులు ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది ఘటనపై సంబంధిత పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు