10 March, 2026 | 5:39 PM

అదుపు తప్పి డివైఢర్‌ను ఢీకొట్టిన కారు

10-03-2026 02:45 AM

కారు నడుపుతున్న వృద్దుడికి అకస్మాత్తుగా గుండెపోటు

సీపీఆర్ చేసిన పోలీసులు

సికింద్రాబాద్, మార్చి9 (విజయక్రాంతి): ట్రాఫిక్‌లో వెళుతున్న ఓ కారు అకస్మాత్తుగా అదుపు తప్పి డివైఢర్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. కారు నడుపుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఈ సంఘటన చో టు చేసుకుంది. సంగీత్ చౌరస్తాలో సోమవా రం చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సంగీత్ వైపు వెళ్తున్న కారు ఇస్కాన్ దేవాలయం సమీ పంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది.

గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే కారు అద్దాలు తీసి చూడగా డ్రైవింగ్ సీటులో ఉన్న ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థత తో శ్వాస సంబంధమైన ఇబ్బందికి గురువుతున్నట్లు గుర్తించారు. కారులో ఉన్న వృద్ధుడికి ఆకస్మికంగా గుండె పోటు రావడంతో ఈ ప్రమాదం చోటుచేసున్నట్లుగా గుర్తించిన గోపాలపురం ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్ తన సిబ్బందితో కలిసి కార్ డోర్లు తెరిచి వృద్ధుడికి సీపీఆర్ నిర్వహిం చారు. అనంతరం అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు.