వేసవి నేపథ్యంలో రైల్వే భద్రతపై సమీక్ష
సికింద్రాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ట్రాక్లను బలోపేతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులకు సూచించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సోమవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైళ్ల రాకపో కలు సజావుగా సాగేందుకు ట్రాక్లపై క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు నిర్వహిం చడంతో పాటు అవసరమైన చోట బ్యాలస్ట్ ఫిల్లింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్‌తోపాటు విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.




