10 March, 2026 | 2:32 PM

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి

10-03-2026 02:42 AM

ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి

ముషీరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రభుత్వం కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిందని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి ఆరోపించారు.

ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రకటించిన ఈ 99 రోజుల కార్యక్ర మం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన ప్రయోజనం కలుగుతుందో, బడ్జెట్ ఎంత కేటాయించిందో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు ఆర్.వి.ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.రాములు యాదవ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొనగా.. అగ్రగామి కిసా న్ సభ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా అంద వీరన్న నియమించినట్లు వారు ప్రకటించారు.