8 July, 2026 | 8:05 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

సీఐటీయు ఆధ్వర్యంలో ఘనంగా మేడే

01-05-2026 07:31 PM

దమ్మపేట,(విజయక్రాంతి): శ్రామిక ప్రజల అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం మేడే అని, తమ సమస్యలు పరిష్కారం కొరకు పోరాటాలు ఉదృతం  చేస్తూ దోపిడి రహిత సమాజం అనే అంతిమ లక్ష్యం చేరుకునేందుకు కృషి చేసే రోజు అని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సీఐటీయు మండల కమిటీ ఆధ్వర్యంలో హమాలి అడ్డ, జిసిసి, సీఐటీయు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిసిసి అడ్డా వద్ద జరిగిన సభ కు సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు అధ్యక్షత వహించారు.

అనంతరం సభలో పిట్టల అర్జున్ మాట్లాడుతూ... ఆనాడు శ్రమజీవులు పై పని భారమే గాక పని గంటల భారం కూడా అధికంగా ఉండేదని, తమపై జరుగుతున్న శ్రమ దోపిడీని నిరసిస్తూ కార్మిక వర్గం అత్యంత చైతన్యంతో తమకు హక్కులు, చట్టాలు కల్పించాలని రక్తం చిందిస్తేనే ఈనాడు సమస్త కార్మిక లోకం వాటి ఫలాలను అనుభవిస్తుందని అన్నారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ... అనగదొక్కబడిన కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించాలని అన్నారు.