మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన కారు
రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలు
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన భానోత్ నాగేశ్వరరావు, తన కుమారుడు జ్ఞానేశ్వర్ తో మోటార్ సైకిల్ పై రేగుల గడ్డ తండ నుంచి వస్తూ కీతవారిగూడెం యూటర్న్ వద్ద హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడ వైపుకు వెళుతున్న కారు ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై ఉన్న తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన నాగేశ్వరరావు, జ్ఞానేశ్వరను108 లో హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గాయపడిన ఇద్దరిని హైదరాబాద్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారును వదిలేసి పరారైన వ్యక్తిని కోదాడకు చెందిన నాగులు మీరా గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్సై చలిగంటి నరేష్ తెలిపారు.




