క్యాన్సర్ సంబంధిత రోగులను గుర్తించాలి
ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
హనుమకొండ, జూన్ 19(విజయ క్రాం తి): ప్రభుత్వం క్యాన్సర్ ను నోటిఫైయబుల్ వ్యాధుల జాబితాలో చేర్చినందున జిల్లాలోని క్లినిక్ లు, డయాగ్నొస్టిక్ సెంటర్ లు, హాస్పిటల్‌లు తప్పనిసరిగా తెలంగాణ క్యాన్స ర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని, గుర్తించిన ,చికిత్స అందించిన లేదా తమ వద్దకు వచ్చిన క్యాన్సర్ కేసులను పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని హనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఎస్ .డి .రాంకుమార్ ఆ దేశించారు.
అందులో భాగంగా ఆయన శు క్రవారం హనుమకొండ లోని రెనోవా బ న్ను క్యాన్సర్ హాస్పిటల్, అజర హాస్పిటల్ , విజయ డయాగ్నొస్టిక్ సెంటర్, రాడార్ డ యాగ్నొస్టిక్ సెంటర్ లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోర్టల్ లో వా రు నమోదు చేస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు.ప్రస్తుతం నాన్ కమ్యూనికేబు ల్ వ్యాధులలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతుండడం అలాగే మరణాలు ఎక్కువగా నమోదవుతున్నందున వ్యాధి తీవ్రతను ,అలాగే రిస్క్ ఫ్యాక్టర్లను ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించడంలో భాగంగా ప్రత్యేకించినఈ పోర్టల్ లో ప్రతి క్లినిక్ ,ఆసుపత్రి నమోదు చేసుకొని తమవద్ద నిర్ధారిం చబడిన ,
చికిత్స అందిస్తున్న, తమ ఓపి కి వచ్చిన అన్ని రకముల క్యాన్సర్ కేసుల పూర్తి వివరాలు పోర్టల్ లో నమోదు చేయాలన్నా రు. లేబరేటరీలు , డయాగ్నొస్టిక్ సెంటర్లు నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, వ్యాధి నిర్ధారణలో , రిపోర్టింగ్ లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపకూడదన్నారు. రాబోయే వర్షాకాలంలో రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్టింగ్ ద్వారా పాజిటివ్ లను అన్నిం టిని డెంగ్యూ గా నిర్దారించి ప్రజలను ఆం దోళనకు గురి చేయవద్దని , డెంగ్యూ ఎలిసా పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి డెంగ్యూ ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించాలన్నారు. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిన ప్రతి కేసు డెంగ్యూ గా పరిగణించకూడదన్నారు. తప్పుడు రిపోర్టులు అందించే సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్మోహన్ రావు, ఎన్సీడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి, డిపిఓ రుక్ముద్దీన్, సంబంధిత ఆసుపత్రుల డాక్టర్లు పాల్గొన్నారు.






